: మోడీ పెద్దమనసుకు నిదర్శనం ఈ సంఘటన


ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుని... ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని మరింత భాసిల్లేలా చేసింది. కుటుంబ సభ్యులకు దూరమై నిస్సహాయ స్థితిలో 16 ఏళ్ల కిందట తనను కలిసిన జీత్ బహదూర్‌ అనే యువకుడిని పెద్ద చేసి, అతనిని సొంత గూటికి చేర్చారు ప్రధాని. చాలా ఏళ్ల క్రితం ఏమీ తెలియని, భాష కూడా రాని పసివాడు జీత్ ను గుజరాత్ లోని అహ్మదాబాద్ లో కలుసుకున్నానని మోడీ ట్విట్టర్లో తెలిపారు. అప్పట్నుంచి అతడి బాధ్యతను మోడీ తీసుకున్నారు. అతడికి విద్యాబుద్ధులు నేర్పించారు. జీత్ ప్రస్తుతం అహ్మదాబాద్‌లో బీబీఏ చదువుతున్నాడు. మోడీ ప్రధాని పీఠాన్ని చేపట్టిన తరువాత బహదూర్ యూనివర్శిటీ హాస్టల్‌కు మారాడు. రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోడీ నేపాల్‌ చేరుకున్న నేపథ్యంలో బహదూర్ ను ఇరుదేశాల అధికారుల సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో అతని కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.

  • Loading...

More Telugu News