: వసతి గృహాలకు ప్రత్యేక అధికారులు: ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల


సాంఘిక సంక్షేమశాఖకు చెందిన ప్రతి వసతి గృహంలో ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. రాజమండ్రిలో వసతి గృహాలను సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల విద్యావిధానం, సౌకర్యాలను ఆ అధికారి పర్యవేక్షిస్తారని అన్నారు. ఆగస్టు 1 నుంచి 15 వరకు వసతి గృహాల్లో ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లో సౌకర్యాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News