: ట్రాఫిక్ పోలీసులకు నాయిని బంపర్ ఆఫర్
తెలంగాణ ట్రాఫిక్ పోలీసులకు ఆ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం వేతనాలు పెంచుతామని అన్నారు. పగలనక రాత్రనక నడి రోడ్డుపై కష్టపడే ట్రాఫిక్ పోలీసులకు హెల్త్ కార్డులు అందజేస్తామని, వారంలో ఒక రోజును సెలవు దినంగా ప్రకటిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. మంత్రి వరాలతో ట్రాఫిక్ పోలీసుల్లో హర్షం వ్యక్తమైంది.