: వారానికి మూడే పని దినాలు... కొత్త ప్రతిపాదన


కాలం మారుతోంది...కాలంతో పాటు పనిదినాల సంఖ్య, పనిదినాల వేళలు కూడా మారుతూ వస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతీయుల సేవలు నిరుపమానమైనవి. అవుట్ సోర్సింగ్ పేరిట భారతదేశం ప్రతియేటా లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోంది. దీంతో వారంలో ఆరు రోజులు పని చేసే ఉద్యోగులు ఐదు రోజులు చేస్తే చాలని సాఫ్ట్ వేర్ కంపెనీలు వీకెండ్ డేస్ గా శని, ఆది వారాలను సెలవుదినాలుగా ప్రకటించాయి. ఇది ఫలించి ఐదు రోజులు ఉద్యోగులు నిబద్ధతతో పని చేసి ఉత్పత్తి పెంచడం ప్రముఖ సంస్థలు గ్రహించాయి. దీంతో మూడు రోజుల పనిదినాల ప్రతిపాదనతో ముందుకు వస్తున్నాయి. వ్యాపార దిగ్గజాలు కార్లోస్ సిమ్, రిచర్డ్ బ్రాన్సన్ లు రోజుకు 11 గంటల చొప్పున వారంలో మూడే రోజులు పని చేస్తే మరింత మెరుగైన ఉత్పాదన సాధించవచ్చని అభిప్రాయపడుతున్నారు. వారి ప్రతిపాదనపై భారతీయ హెచ్ఆర్ నిపుణులు పెదవి విరుస్తున్నారు. భారతీయ పరిస్థితులకు ఆ ప్రతిపాదన ఏమాత్రం సూట్ కాదని అభిప్రాయపడుతున్నారు. కస్టమర్ సర్వీస్, రిటైల్, ఎంటర్ టైన్ మెంట్, హెల్త్ కేర్ రంగాల్లో మూడు పని దినాలంటే కుదిరే పని కాదనీ, గంటల ప్రాతిపదిక పని చేసే ఉద్యోగులకు ఈ నిర్ణయం ప్రతికూలంగా మారుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాగా, విదేశీయతను తొందరగా సొంతం చేసుకునే భారతీయులు దీనికి కూడా తొందరగానే అలవాటు పడతారని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News