: దేశ సంపద పరిరక్షణలో సీఐఎస్ఎఫ్ దే కీలక భూమిక: హోంశాఖ సహాయ మంత్రి
దేశ సంపదను పరిరక్షించడంలో సీఐఎస్ఎఫ్ బలగాలదే కీలక భూమిక అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు అన్నారు. రంగారెడ్డి జిల్లా శామీర్ పేటలో ఆదివారం జరిగిన సీఐఎస్ఎఫ్ పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ సంపద రక్షణ బాధ్యతలను చేపడుతున్న సీఐఎస్ఎఫ్ ను మరింత బలోపేతం చేయడంతో పాటు పటాలాన్ని ఆధునికీకరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉగ్రవాదం, నక్సలిజం నుంచి ప్రభుత్వ ఆస్తులనే కాక ప్రైవేటు ఆస్తులను కాపాడాల్సిన గురుతర బాధ్యతలను సైనికులు గుర్తెరగాలన్నారు. సీఐఎస్ఎఫ్ పటాలంలో శిక్షణ తీసుకున్న వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మంత్రి చెప్పారు.