: ఎంపీ ఫేస్ బుక్ వివాదం కీలక మలుపు...వైఎస్సార్సీపీ నేతే సూత్రధారి
వైఎస్సార్సీపీ ఎంపీ కొత్తపల్లి గీతపై ఫేస్ బుక్ లో అసభ్యకర సందేశాలు పోస్ట్ చేయడంపై నమోదైన కేసు కీలక మలుపు తిరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును ఎంపీ గీత కలిసిన తరువాత ఆమె ఫేస్ బుక్ అకౌంట్ లో అసభ్యకర సందేశాలు, ఇబ్బందికరమైన రీతిలో ఫోన్లు రావడం మొదలైందంటూ ఆమె ప్రతినిధి డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు నివేదిక రాకముందే ఎంపీ కొత్తపల్లి గీత పీఏ విశాఖపట్టణం ఫోర్త్ టౌన్ పోలీసు స్టేషన్ లో వైఎస్సార్సీపీలోని నేత ఒకరు ఎంపీపై అసభ్యకర సందేశాలు పోస్టు చేయడం వెనుక ఉన్నారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో అతని హస్తంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వైఎస్సార్సీపీ నేత ఎవరు? అనే విషయం ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. ఆధారాలు సేకరించిన వెంటనే అతని పేరు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారని ఎంపీ పీఏ తెలిపారు.