: విజయశాంతి పార్టీ మారడం లేదు: పొన్నాల
తమ పార్టీ నేత విజయశాంతి కాంగ్రెస్ ను వీడనున్నారంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. ఆమె పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. కాగా, కాంగ్రెస్ కు గెలుపోటములు కొత్త కాదని, పార్టీలో నేతలకు స్వేచ్ఛ ఎక్కువని అన్నారు. తమ నేతలకు ధైర్యమిస్తున్న పార్టీ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తల అభిప్రాయాలు తీసుకునేందుకే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని పొన్నాల చెప్పారు.