: 'కిక్' తొలి వారం కలెక్షన్లు 178.28 కోట్లు... పాకిస్థాన్ లో 2 కోట్లు
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా 'కిక్' రెండు వందల కోట్ల క్లబ్ లో చేరేందుకు జోరుగా దూసుకుపోతోంది. రంజాన్ ను పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా 5 వేల సినిమా థియేటర్లలో విడుదలైన 'కిక్' సినిమా తొలి రోజే 80 కోట్ల రూపాయలు వసూలు చేసి సంచలనం సృష్టించింది. 'కిక్' సినిమా తొలి వారం 178.28 కోట్ల రూపాయలను వసూలు చేసి విమర్శకుల నోళ్లు మూయించింది. పాకిస్థాన్ లో 2 కోట్ల రూపాయలను 'కిక్' సినిమా వసూలు చేసినట్టు సమాచారం.