: చివరి శుక్రవారం సందర్భంగా చార్మినార్ పరిసరాల్లో ఆంక్షలు


రంజాన్ మాసం పూర్తికావస్తున్న సందర్భంగా చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. చివరి శుక్రవారం సందర్భంగా మక్కామసీదుకు హైదరాబాద్ నలుమూలల నుంచి ముస్లిం సోదరులు ప్రార్థనల కోసం చేరుకుంటారు. దీంతో శుక్రవారం నుంచి చార్మినార్ పరిసరప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పోలీసులు వివరించిన ప్రకారం చార్మినార్ నుంచి మదీనా, చార్మినార్ నుంచి మురిగిచౌక్, చార్మినార్ నుంచి మొఘల్‌పుర కమాన్ వరకూ వాహనాల రాకపోకలు నిలిపేసినట్టు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. చివరి శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వారు స్పష్టం చేశారు. రంజాన్ ప్రార్థనల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ భద్రతాచర్యలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News