: సీరియళ్ళు చూస్తే ఇలానే తయారవుతారు!


సీరియళ్ళు చిన్నారులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఈ సంఘటన వింటే చక్కగా అర్థమవుతుంది. ఓ పదమూడేళ్ళ అబ్బాయి హడావుడిగా నడుచుకుంటూ నేరుగా ముంబయి యాంటి నార్కోటిక్స్ సెల్ లోకి వెళ్ళిపోయాడు. దయా, అభిజీత్ లను కలవాలని అక్కడి అధికారులను కోరాడు. ఎవరీ దయా, అభిజీత్ అనుకుంటూ కాసేపు జుట్టు పీక్కున్న అధికారులు నిదానంగా ఆ బాలుడిని ప్రశ్నించి అసలు విషయాలు రాబట్టారు. విషయం ఏమిటంటే... రోజూ టీవీలో ప్రసారమయ్యే 'సీఐడీ' సీరియల్ ను ఆ టీనేజర్ మిస్ కాకుండా చూస్తుంటాడు. అందులోని పాత్రలే దయా, అభిజీత్. వారిద్దరూ సీఐడీ అధికారులు. తమ ప్రజ్ఞాపాటవాలతో క్లిష్టమైన కేసులను సైతం ఇట్టే ఛేదిస్తుంటారు. దీంతో, ఈ కుర్రాడు కాస్తా వారిద్దరిపై విపరీతమైన అభిమానం పెంచేసుకున్నాడు. ఆ జోడీ నిజంగానే అధికారులని భావించాడు. సీన్ కట్ చేస్తే... ఇండోర్ నుంచి రైలులో బయలుదేరి ముంబయిలో తేలాడు. ఈ వ్యవహారాన్ని పోలీసులు ఆ బాలుడి తల్లిదండ్రులకు తెలిపారు. అనంతరం ఆ బాలుడిని డోంగ్రీలోని చిల్డ్రన్స్ హోంలో చేర్చారు.

  • Loading...

More Telugu News