: పోర్టులు, ఎయిర్ పోర్టులతో కళకళలాడనున్న ఏపీ


ఆంధ్రప్రదేశ్ లో భారీ సంఖ్యలో పోర్టులను నిర్మించేందుకు సర్కారు నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఉన్న కాకినాడ, కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ సెజ్ పోర్టులకు తోడు మరో పది కొత్త పోర్టులు నిర్మించాలని భావిస్తున్నారు. ఇవే కాకుండా విశాఖ, గన్నవరం, రేణిగుంట విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన అత్యున్నతస్థాయి సమావేశం అనంతరం ఈ విషయాలను ప్రకటించారు. కాగా, ఈ అంశాలపై ఆరు వారాల్లోగా నివేదిక అందించాలని సర్కారు అధికారులను ఆదేశించింది.

  • Loading...

More Telugu News