: చంద్రబాబుతో సమావేశమైన వెంకయ్య నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమావేశమయ్యారు. ‘రాష్ట్రాల వద్దకే కేంద్రం’ కార్యక్రమంలో భాగంగా ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధిపై ప్రధానంగా ఈ భేటీలో వెంకయ్యనాయుడు చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, నిధులపై చంద్రబాబును నివేదిక ఇవ్వాలని ఆయన కోరారు. అనంతరం ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా సమావేశం కానున్నారు.