: ఈ నెల 13న కోనేరు హంపి వివాహం... చంద్రబాబుకు ఆహ్వానం


ప్రముఖ చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి పెళ్లి కూతురు కాబోతోంది. ఎప్ట్రానిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ దాసరి రామకృష్ణ తనయుడు అన్వేష్ తో ఈ నెల 13న వివాహం జరగనుంది. పెద్దలు నిశ్చయించిన ఈ పెళ్లి విజయవాడలోని 'ఏ కన్వెన్షన్ సెంటర్'లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో హంపి తండ్రి కోనేరు అశోక్ సతీసమేతంగా హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును తమ కుమార్తె వివాహానికి ఆహ్వానించారు. పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అభివృద్ధి కోసం రెండు లక్షల రూపాయల విరాళాన్ని వారు సీఎంకు అందజేశారు.

  • Loading...

More Telugu News