: మాజీ ఎమ్మెల్యే ఇంట్లో పేలిన తుపాకీ
మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి ఇంట్లో తుపాకీ పేలింది. ఈ ఘటనలో ఆయన అనుచరుడు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, అతడిని ఆసుపత్రికి తరలించారు. కర్నూలు ఎఫ్ సీఐ కాలనీలో ప్రమాదవశాత్తు గన్ మిస్ ఫైర్ అయి ఈ ప్రమాదం సంభవించింది. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గానికి రాంభూపాల్ రెడ్డి ప్రాతినిథ్యం వహించారు. ఈ ఘటనపై పోలీసులు ఇంతవరకు కేసు నమోదు చేయనట్టు సమాచారం.