: టీమిండియా 'గాయ'కుల జాబితాలో మరొకరు చేరారు!
ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే ప్రధాన బౌలర్ ఇషాంత్ శర్మ మడమ గాయంతో జట్టుకు దూరం కాగా, యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా ఇదే తరహా గాయంతో బాధపడుతున్నాడు. భువీ మడమ వాపుతో ఇబ్బంది పడుతుండడం టీమిండియా మేనేజ్ మెంట్ ను ఆందోళనకు గురిచేస్తోంది. సౌతాంప్టన్ లో ఇషాంత్ లేని లోటు స్పష్టంగా వెల్లడైంది. లంబూ నాలుగో టెస్టుకూ దూరమైన నేపథ్యంలో భువీ కూడా వైదొలిగితే పరిస్థితి ఏమిటన్నది కెప్టెన్ ధోనీ, కోచ్ ఫ్లెచర్ లకు అంతుచిక్కకుండా తయారైంది.