: ఏపీలో కొత్త ఐటీ పాలసీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్


ఈ నెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. హైదరాబాదులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో ఇవాళ ఏపీ కేబినేట్ భేటీ జరిగింది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశ వివరాలను మంత్రి మీడియాకు వివరించారు. అక్టోబరు 2 నుంచి గృహాలకు, పరిశ్రమలకు 24 గంటలూ విద్యుత్తును ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. ఏపీలో ‘అన్న క్యాంటీన్’ లను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్న క్యాంటీన్ అమలుకు సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కొత్త ఐటీ పాలసీని రూపొందించామని, 5 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించే ఐటీ ప్రాజెక్టులకు 60 శాతం రాయితీని ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. ఒక్కో ఉద్యోగికి రూ.60 వేల చొప్పున రాయితీని అందించాలని ఐటీ కంపెనీలకు విజ్ఞప్తి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఐటీ కంపెనీలను నెలకొల్పే మహిళలు, ఎస్టీ, ఎస్సీలకు మరింత ప్రయోజనకరంగా రాయితీలు అందిస్తామన్నారు. ఐటీ కంపెనీలకు విద్యుత్ ఛార్జీల్లో 25 శాతం రాయితీని అందిస్తామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News