: అలా ఆడితే... ర్యాంకులు ఇలానే వస్తాయి!
ఇంగ్లండ్ తో మూడో టెస్టులో పేలవ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన టీమిండియా బ్యాట్స్ మెన్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో పలు స్థానాలు కిందికి జారారు. ఐసీసీ నేడు విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ జాబితాలో ఛటేశ్వర్ పుజారా రెండు స్థానాలు పతనమై పదోస్థానంలో నిలిచాడు. ఇక, స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ ఓ స్థానం దిగజారి 15వ ర్యాంకు పొందాడు. వీరు తప్ప మిగిలిన బ్యాట్స్ మెన్ ఎవరూ టాప్ 20 దరిదాపుల్లోనే లేరు. ఈ జాబితాలో సఫారీ బ్యాట్స్ మన్ ఏబీ డివిల్లీర్స్ అగ్రస్థానం అలంకరించాడు. అతని తర్వాత స్థానంలో లంక దిగ్గజం కుమార సంగక్కర ఉన్నాడు.