: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ... 16 నుంచి బడ్జెట్ సమావేశాలు


హైదరాబాదులోని లేక్ వ్యూ అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ఈ నెల 16 నుంచి ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరపాలని నిర్ణయించింది. బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడమే గాక, 'అన్న' క్యాంటీన్లు పెట్టేందుకు ఆమోదం తెలిపింది. అటు, తిరుమల తిరుపతి దేవస్థానం సహా అన్ని దేవాలయాల పాలకమండళ్లు రద్దు చేస్తూ ప్రత్యేేక ఆర్డినెన్స్ తీసుకువాలని, ప్రస్తుతం ఉన్న ఇసుక రీచ్ ల్లో 25 శాతం డ్వాక్రా సంఘాలకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇక, 'బడి పిలుస్తోంది', 'నీరు-చెట్లు', 'పొలం పిలుస్తోంది' పథకాలపై మంత్రివర్గం సమీక్ష జరిపింది.

  • Loading...

More Telugu News