: గ్రూప్ డీ ఉద్యోగాల పరీక్ష షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రూప్ డీ ఉద్యోగాల నియామకం కోసం ఆర్ఆర్ సీ పరీక్ష షెడ్యూల్ ను విడుదల చేసింది. నవంబర్ 2,9,16,23,30 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ (ఆర్ఆర్ సీ) తెలిపింది. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, తిరుపతి, నాందేడ్ లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఇందులో అర్హులైన అభ్యర్థుల వివరాలు దక్షిణమధ్య రైల్వే వెబ్ సైట్ లో లభిస్తాయని అధికారులు చెప్పారు. గతేడాది ఆగస్టు 8న గ్రూప్ డీ ఉద్యోగాల కోసం ఆర్ఆర్ సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.