: 'టైమ్స్ ఆఫ్ ఇండియా'ను టార్గెట్ చేసిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మీడియాపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వానికి సంబంధించిన వార్తలను రాసేటప్పుడు జాగ్రత్త వహించాలని... సెన్సేషన్ కోసం వార్తలు రాయరాదని చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు ఇష్టమొచ్చిన రీతిలో కథలను ప్రసారం చేస్తున్నాయని... వాటి సంగతి తర్వాత చూస్తామని అన్నారు. ప్రభుత్వం తరపున కూడా పత్రిక స్థాపించే ఆలోచన ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆంగ్ల దినపత్రిక 'టైమ్స్ ఆఫ్ ఇండియా'పై కేసీఆర్ విరుచుకుపడ్డారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కున్న అధికారాలన్నింటినీ తాను లాక్కున్నానని... బడ్జెట్ విషయాలను కూడా తానే నిర్ణయిస్తున్నానంటూ వార్తలు రాశారని... ఈ వివరాలను వారికి ఎవరు చెప్పారని ప్రశ్నించారు. దీనికి సంబంధించి తాను ఆ పత్రిక నుంచి వివరణను డిమాండ్ చేస్తున్నానని చెప్పారు. మీడియాకు తాను వార్నింగ్ ఇవ్వడం లేదని... ఆవేదనతో మాట్లాడుతున్నానని చెప్పారు. సంచలనాలకోసం వాస్తవాలను వక్రీకరించరాదని కోరారు.