: చంద్రబాబు, జగన్ హాజరు... కేసీఆర్ గైర్హాజరు
హైదరాబాదు రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఇవాళ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరినీ ఆహ్వానించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులకూ ఆహ్వానం అందింది. అయితే, ఈ ఇఫ్తార్ విందుకు చంద్రబాబు హాజరు కాగా, కేసీఆర్ గైర్హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్శింహారెడ్డి, ఈటెల రాజేందర్ ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. అలాగే వైఎస్సార్సీపీ అధినేత జగన్, టీ-పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి జానారెడ్డి, ఇరు రాష్ట్రాల డీజీపీలు, పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.