: ఈ రహస్య మంతనాలు ఏమిటి కోహ్లీ?


టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కలసి సీక్రెట్ గా డిన్నర్ చేశారు. ఈ వ్యవహారం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంగ్లండ్ లోని సౌతాంప్టన్ లోని బ్రెజిలియన్ రెస్టారెంట్ లో వీరిద్దరూ విందు ఆరగించినట్టు బీబీసీ రేడియో ఓ కథనం ప్రసారం చేసింది. సాంకేతిక నైపుణ్యంతో షాట్లు ఆడే కోహ్లీ ఇంగ్లండ్ పర్యటనలో ఘోరంగా విఫలమవుతున్నాడు. కోహ్లీకి ఇదే తొలి ఇంగ్లండ్ పర్యటన దీంతో ఇక్కడి పిచ్ లపై పెద్దగా అవగాహన లేదు. వాన్ కు ఇక్కడి పిచ్ లు కొట్టిన పిండి. దీంతో ఇక్కడ రాణించడానికి కోహ్లీ విందు గాలమేసి ఉంటాడని మాజీలు చెబుతున్నారు. కాగా, డిన్నర్ వ్యవహారం రెండు శిబిరాల్లో ఆసక్తిని రేపింది. దీనిపై వాన్, కోహ్లీ స్పందించకపోవడంతో ఊహాజనిత కథనాలు పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్నాయి. విందు తరువాత ఇంగ్లీష్ స్వింగ్ పిచ్ లపై బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటే వారి మధ్య కోహ్లీ బ్యాటింగ్ పై చర్చ జరిగినట్టు, లేకుంటే ఇంకేమైనా చర్చలు జరిగినట్టు భావించడమే!

  • Loading...

More Telugu News