: ఆగస్టు 16 నుంచి ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 16 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ విప్, విప్ లతో ముఖ్యమంత్రి చంద్రబాబు జరిపిన భేటీలో బడ్జెట్ సమావేశాలపై చర్చించారు. 18న ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తొలి బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అయితే, సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.