: జీహెచ్ఎంసీ కమిషనర్ పై మండిపడిన మేయర్
గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ సోమేష్ కుమార్ పై నగర మేయర్ మాజిద్ హుస్సేన్ మండిపడ్డారు. రోడ్లపై చెత్త వేస్తే జైలుకు పంపిస్తామన్న కమిషనర్ ఆదేశాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ ఉత్తర్వులపై తమకేం సంబంధం లేదని మేయర్ చెప్పారు. స్టాండింగ్ కమిటీ ఆమోదం లేకుండా నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు.