: ఏపీ 'రాజధాని' ఎఫెక్ట్... మూడు రోజుల్లో 6 వేల రిజిస్ట్రేషన్లు
ఆంధ్రప్రదేశ్ రాజధానిని విజయవాడ - గుంటూరు మధ్య ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ సూచించడం, ఆగస్టు 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచనున్నామని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రకటించిన నేపథ్యంలో అక్కడ గత మూడు రోజుల్లో రిజిస్ట్రేషన్ల జాతర నెలకొంది. మూడు రోజుల్లో ఆరు వేల రిజిస్ట్రేషన్లు జరిగినట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. గుంటూరు జిల్లా సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలో రోజుకు 700 రిజిస్ట్రేషన్లు నమోదవుతుంటాయి. సోమవారం 2,200 రిజిస్ట్రేషన్లు జరగగా, బుధవారం 3 వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు, పెదకాకాని, నల్లపాడు గ్రామాలతోపాటు కృష్ణా జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట, గన్నవరం, నూజివీడు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు పెరగడం విశేషం.