: ఏ దేశమేగినా మోడీ ప్రాధాన్యత రాజభాషకే!
భారత ప్రధాని నరేంద్ర మోడీ రాబోయే నెలల్లో విస్తృతంగా విదేశీ పర్యటనలు చేయనున్నారు. ఈ ఆగస్టు మొదటివారంలో నేపాల్లోనూ, అనంతరం సెప్టెంబర్ మాసంలో అమెరికా, జపాన్ లలోనూ పర్యటిస్తారు. ఇక ఈ ఏడాది చివరన చైనా, రష్యా అధినేతలతో శిఖరాగ్ర చర్చలు జరుపుతారు. అయితే, ఈ పర్యటనల సందర్భంగా మోడీ ఆంగ్లానికి బదులు జాతీయ భాష హిందీలోనే మాట్లాడాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఐక్యరాజ్యసమితిలోనూ ఆయన రాజభాషలోనే ప్రసంగించనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇంగ్లిష్ కంటే హిందీలోనే జాతీయాలు, నుడికారాలను అలవోకగా ప్రయోగించవచ్చని మోడీ భావిస్తుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. చమక్కులు, సామెతలు, చురకలతో కూడిన ఆయన ప్రసంగాలు సభికులను ఉర్రూతలూగిస్తాయనడానికి గత ఎన్నికల వేళ నిర్వహించిన సభలే తార్కాణం.