: పర్మిట్ ట్యాక్స్ విధింపుపై హైకోర్టులో విచారణ


ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి వచ్చే వాహనాలపై పర్మిట్ ట్యాక్స్ విధిస్తూ జారీ చేసిన సర్క్యులర్ మెమోపై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్ పరిశీలించిన కోర్టు, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేస్తూ నోటీసులు జారీ చేసింది. అటు తెలంగాణ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణలోని కొన్ని జిల్లాల ఎంవీఐలతో పాటు ప్రతివాదులందరికీ నోటీసులు ఇచ్చింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు 3 వారాల సమయం ఇస్తూ న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. రెండు రాష్ట్రాల్లోనూ ఈ-పన్ను చెల్లించే వెసులుబాటు ఉందని న్యాయస్థానం ఈ సందర్భంగా తెలిపింది. అయితే, వసూలు చేసిన తాత్కాలిక పర్మిట్ పన్నును తుది తీర్పు తర్వాత తిరిగి చెల్లించేలా బాండ్లు ఇవ్వాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయస్థానం ఆదేశించింది.

  • Loading...

More Telugu News