: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి కామినేని ఆదేశం
ఆంధ్రప్రదేశ్ లో సీజనల్ వ్యాధుల పట్ల రాష్ట్రంలోని జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆదేశించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ సాధారణ వ్యాధులన్నింటికీ మందులను సిద్ధం చేయాలని సూచించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.