: బిడ్డకోసం తల్లి ఎంతకైనా తెగిస్తుంది!


కన్నకూతురిపై ఓ చిరుత పులి దాడి చేయడం చూసిన ఆ మహిళ మరేమీ ఆలోచించకుండా ఆ క్రూరమృగంపైకి లంఘించింది. చేతిలో కొడవలి తప్ప మరే ఆయుధం లేదు. దాంతోనే పులిని ఎదుర్కొంది. వివరాల్లోకెళితే... ఉత్తరాఖండ్ లోని జఖోలి గ్రామానికి చెందిన పింగళ దేవి (45) అనే మహిళ తన పదిహేనేళ్ళ కుమార్తె కుసుమ్ తో కలిసి పశుగ్రాసం కోసం సమీపంలోని అడవికి వెళ్ళింది. తిరిగి వస్తుండగా ఓ చిరుతపులి కుసుమ్ పై దాడి చేసింది. ఇది చూసిన పింగళ దేవి పశుగ్రాసం మోపును కిందపడేసి చేతిలో ఉన్న కొడవలితో చిరుతతో కలబడింది. దీంతో ఆ మృగం కాస్తా కుసుమ్ ను వదిలేసి తల్లిపై దూకింది. ఇంతలో అక్కడికి వచ్చిన గ్రామస్తులను చూసి ఆ చిరుత పొదల్లోకి వెళ్ళిపోయింది. గాయపడిన పింగళదేవిని గ్రామస్తులు ఆసుపత్రిలో చేర్చారు. కాగా, ఆ చిరుతను మేన్ ఈటర్ గా ప్రకటించి, చంపేయాలని జఖోలి గ్రామస్తులు స్థానిక అధికారులను డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News