: ప్రభుత్వానికి సహకరిస్తూనే లోటుపాట్లను ఎత్తి చూపుతాం: కోదండరాం


తెలంగాణ ఉద్యమంలో క్షణం తీరికలేకుండా వ్యవహరించి కోట్లాదిమందిలో స్పూర్తి నింపిన నేత ప్రొఫెసర్ కోదండరాం. ఈ రోజు ఆయన తిరిగి తన అధ్యాపక వృత్తిలో అడుగుపెట్టారు. ఉస్మానియా పీజీ కాలేజీలో ప్రొఫెసర్ గా మళ్లీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యమం కోసం నాలుగేళ్లుగా లీవ్ లో ఉన్నానని చెప్పారు. ప్రొఫెసర్ వృత్తిలో ఉన్నప్పటికీ ప్రజలకు అందుబాటులోనే ఉంటానని... తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామిగానే ఉంటానని స్పష్టం చేశారు. ప్రభుత్వ పనితీరును పర్యవేక్షిస్తుంటానని... ప్రభుత్వానికి సహకరిస్తూనే లోటుపాట్లను ఎత్తి చూపుతానని చెప్పారు. ఉద్యమంలో అనుభవంలోకి వచ్చిన విషయాలను తన విద్యార్థులకు బోధిస్తానని తెలిపారు.

  • Loading...

More Telugu News