: కవిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కోర్టులో కేసు వేసిన బీజేపీ లీడర్
తెలంగాణ, జమ్మూకాశ్మీర్ ల గురించి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తెలంగాణ, జమ్మూకాశ్మీర్ లను బలవంతంగా ఇండియన్ యూనియన్ లో కలిపారంటూ అనుచితంగా వ్యాఖ్యానించిన ఎంపీ కవితపై ఐపీసీ సెక్షన్ 124(ఎ), 153(బి), 505ల కింద కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ లీగల్ సెల్ గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ కాశింశెట్టి కరుణాసాగర్ హైదరాబాద్ లోని ఏడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. అయితే, మేజిస్ట్రేట్ ఈ కేసు విచారణను ఆగస్ట్ ఒకటో తేదీకి వాయిదా వేశారు.