: దూరవిద్య డిగ్రీ పరీక్షలను రద్దు చేసిన కేయూ
దూరవిద్య డిగ్రీ పరీక్షలను కాకతీయ విశ్వవిద్యాలయ అధికారులు రద్దు చేశారు. క్వశ్చన్ పేపర్లు లీక్ కావడంతో పరీక్షలు రద్దుచేయాలని నిర్ణయించారు. హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్లగొండ, తూర్పుగోదావరి జిల్లాల్లో పేపర్లు లీక్ అయ్యాయి. పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.