: చదివేది ఎనిమిది... అప్పుడే మిక్సీ, హీటర్ తయారు చేశాడు!


‘పిట్ట కొంచెం - కూత ఘనం’ అంటే ఈ బుడ్డోడికి సరిగ్గా సరిపోతుంది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం రాజులగూడకు చెందిన ఎనిమిదవ తరగతి కుర్రాడు జాదవ్ సాయికిరణ్ ప్రయోగాల్లో రాణిస్తూ అందర్నీ అబ్బురపరుస్తున్నాడు. ఆటలాడుకునే వయసులో ఆటవస్తువులతో ప్రయోగాలు చేసి ఔరా అనిపిస్తున్నాడు. తండ్రి మరణించడంతో అమ్మమ్మ ఇంట్లో చేరిన సాయికిరణ్ తల్లి చిన్న కిరాణా దుకాణం నడుపుతోంది. ఆమె తెచ్చి ఇచ్చే ఆటబొమ్మల్లోని మోటార్లతో సాయికిరణ్ వాటర్ హీటర్, మిక్సీ తయారు చేశాడు. ఓ రేకు తీసుకుని సగం విరగ్గొట్టాడు. దానికి రెండు రంధ్రాలు చేశాడు. ఈ రంధ్రాలకు రెండు విద్యుత్ వైర్లను అమర్చాడు. వాటిని రెండు బ్యాటరీలకు కనెక్షన్ ఇచ్చాడు. వైర్ల ద్వారా విద్యుత్ ప్రవహించి రేకు వేడెక్కి నీటిని వేడి చేస్తుంది. అలాగే ఓ డబ్బా తీసుకుని దానికి రంధ్రం చేశాడు. ఆ రంధ్రానికి బ్లేడ్లు అమర్చి వాటికి ఆటవస్తువులకు వాడే మోటారుతో కనెక్షన్ ఇచ్చాడు. వాటిని బ్యాటరీలకు కలిపితే మిక్సీలా పనిచేస్తుంది. ఈ సరికొత్త మిక్సీ అరకిలో ధనియాలను పొడి చేయడం విశేషం!

  • Loading...

More Telugu News