: ఉద్యోగాలు ఇస్తామంటూ రూ. 60 లక్షలు కొల్లగొట్టారు
సింగపూర్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సింపుల్ గా లక్షలాది రూపాయలను కొల్లగొట్టారు. విశాఖపట్నంలో గ్రేట్ మాస్టర్ కన్సల్టెన్సీ సంస్థను స్థాపించిన ఓ జంట... నిరుద్యోగుల నుంచి సుమారు 60 లక్షల రూపాయలను వసూలు చేసింది. అయితే, కన్సల్టెన్సీ నిర్వాహకులు కనిపించకుండా పోవడంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తును చేపట్టారు.