: స్కైప్ సాయంతో భరతనాట్యం నేర్చుకున్న బాలిక


ఎక్కడో అమెరికాలో ఉన్న బాలిక... భారత్ లో ఉన్న గురువు సూచనలిస్తుండగా భరతనాట్యం నేర్చుకోవడం సాధారణమైన విషయం కాదు. స్కైప్ తో ఇది సాధ్యమైంది. 12 ఏళ్ళ భారత బాలిక అనూషశ్రీ అమెరికాలోని లూయిస్ విల్లేలో జన్మించింది. అక్కడే నివసిస్తోంది. చిన్ననాటే భరతనాట్యం నేర్చుకోవాలన్న తపన కలిగింది ఆమెకు. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆన్ లైన్ మార్గాన్ని ఎంచుకున్నారు. అమెరికాలో గురువులు ఉన్నా, అనూష వారివద్దకు వెళ్ళాలంటే చాలాదూరం ప్రయాణించాల్సి వచ్చేది. దీంతో, స్కైప్ బెటరని భావించారు. ఈ నేపథ్యంలో మైసూర్లోని బదరి దివ్యభూషణ్ ఆమెకు ఆన్ లైన్ లో భరతనాట్యం నేర్పేందుకు అంగీకరించారు. 2013లో ఈ వినూత్న శిక్షణ ప్రారంభం కాగా, ఆ మరుసటి ఏడాదికే ఆమె భారత్ లో ప్రదర్శనలివ్వగలిగే స్థాయికి చేరుకోవడం విశేషం. శిష్యురాలి ప్రతిభకు గురువు దివ్యభూషణ్ మురిసిపోతుంటారు. ఆన్ లైన్ లో శిక్షణ ఇవ్వడం ఏమంత సులువు కాదని ఆయన పేర్కొన్నారు. అనూషకు శిక్షణ ఇచ్చే సమయంలో కొన్నిసార్లు నిద్రకూ దూరమవ్వాల్సి వచ్చేదని వివరించారు.

  • Loading...

More Telugu News