: వ్యవసాయ మార్కెట్లలో 2 రూపాయలకే టిఫిన్, 5 రూపాయలకే భోజనం
తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లలో రెండు రూపాయలకే అల్పాహారం, ఐదు రూపాయలకే భోజనం అందిస్తున్నారు. ‘సుభోజనం’ పేరుతో ప్రారంభమయ్యే ఈ పథకం రేపటి నుంచి అమలవుతోంది. రేపు హైదరాబాదు బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ లో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ‘సుభోజన’ పథకాన్ని ప్రారంభించనున్నారు.