: మనం తినే కోడిమాంసం సురక్షితమైనదని భావిస్తున్నారా?


మాంసాల్లోకెల్లా కోడిమాంసం రుచే వేరు. మటన్ తో పోల్చితే రేటు తక్కువ కావడంతో మాంసాహార ప్రియులు కోడికే తమ ఓటేస్తారు. కానీ, ఆ కోడిమాంసం సురక్షితమైనదేనా? అంటే, కాదంటున్నారు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ (సీఎస్ఈ) పరిశోధకులు. మనం తినే చికెన్ లో యాంటిబయాటిక్స్ అవశేషాలు 40 శాతం మేర ఉంటాయని చెబుతున్నారు. సీఎస్ఈకి చెందిన పొల్యూషన్ మానిటరింగ్ లేబొరేటరీ (పీఎంఎల్) కోడిమాంసం శాంపిళ్ళపై పరిశోధనలు చేపట్టింది. పౌల్ట్రీ పరిశ్రమలో యాంటిబయాటిక్స్ విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారని సీఎస్ఈ పేర్కొంది. త్వరగా ఎదిగేందుకు, స్వల్ప కాలంలోనే బరువు పెరిగేందుకు కోళ్ళకు యాంటీబయాటిక్స్ ఇవ్వడం పరిపాటిగా మారిందని పరిశోధకులు చెబుతున్నారు. ఇలా ఇష్టారాజ్యంగా యాంటీబయాటిక్స్ వాడడం ద్వారా కోళ్ళలో బ్యాక్టీరియా యాంటీబయాటిక్ నిరోధకతను సంతరించుకుంటాయట. ఆ మొండి బ్యాక్టీరియా కోళ్ళ నుంచి మనుషులకు సంక్రమిస్తాయని, తద్వారా ప్రమాదకర వ్యాధులు కోరి తెచ్చుకున్నట్టేనని సీఎస్ఈ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పౌల్ట్రీ పరిశ్రమలో యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించినప్పుడే చికెన్ సురక్షితమైనదిగా భావించాల్సి ఉంటుందని సీఎస్ఈ చెబుతోంది.

  • Loading...

More Telugu News