: అక్బరుద్దీన్ కు మరోసారి కుర్లా కోర్టు సమన్లు
హిందూ, ముస్లింల సఖ్యతను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన కేసులో ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కు ముంబైలోని కుర్లా కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది. ఆగస్టులోగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. గతంలో జారీ చేసిన సమన్లకు హైదరాబాదు పోలీసుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో మరోసారి సమన్లు ఇచ్చినట్లు ఫిర్యాదుదారుడు గులామ్ హుస్సేన్ ఖాన్ తెలిపారు. 2012లో ఆంధ్రప్రదేశ్ లోని ఆదిలాబాద్ జిల్లాలో భైంసాలో అక్బరుద్దీన్ రెచ్చగొట్టే విధంగా మతపరమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై అప్పట్లో తీవ్ర సంచలనం రేగింది.