: ఎస్ఐబీ భవనాన్ని మేమేమీ లూటీ చేయలేదు: ఏపీ డీజీపీ కార్యాలయం


ఎస్ఐబీ భవనాన్ని తాము లూటీ చేశామని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. ఎస్ఐబీ భవనంలో ఫర్నీచర్ తొలగింపుపై నెలకొన్న వివాదాన్ని ఏపీ డీజీపీ కార్యాలయం ఖండించింది. తెలంగాణ ప్రభుత్వం భవనం కావాలని కోరడంతో తాము ఖాళీ చేశామని, సిబ్బందిని మరో భవనానికి మార్చాల్సి రావడంతో ఫర్నీచరును తరలించామని చెప్పారు. ఈ విషయాన్ని తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులకు చెప్పామని డీజీపీ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News