: జమ్మూ కాశ్మీర్ లో మూడేళ్లలో 50 సీబీఐ కేసులు నమోదయ్యాయ్


జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 2011-14 మధ్య కాలంలో సీబీఐ 50 కేసులను నమోదు చేసినట్లు ఇవాళ (బుధవారం) లోక్ సభలో ప్రకటించారు. అందులో 8 కేసులను విచారణ పూర్తి చేసి ముగించడం జరిగిందని లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ పేర్కొన్నారు. 2011వ సంవత్సరంలో 14 సీబీఐ కేసులు, 2012లోనూ 14 కేసులు నమోదయ్యాయని, 2013లో 17 కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. ఇక, ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటివరకు 5 కేసుల్లో సీబీఐ విచారణ చేపట్టిందని మంత్రి చెప్పారు.

  • Loading...

More Telugu News