: ‘మాసాయిపేట’లో గాయపడి... కోలుకున్న 12 మంది చిన్నారులు


మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంలో గాయపడి... యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుల్లో 12 మందిని డిశ్చార్జి చేస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆ ప్రమాదంలోని క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై యశోదా ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. దర్శన్, ఫాతిమా, నితూష పరిస్థితి నిలకడగా ఉందని వారు పేర్కొన్నారు. ప్రశాంత్, వరుణ్, శరత్ పరిస్థితి ఇంకా ఆందోళకరంగానే ఉన్నట్లు యశోదా ఆసుపత్రి డాక్టర్లు చెప్పారు.

  • Loading...

More Telugu News