: 'ఫాస్ట్' పథకం విధివిధానాల ఖరారుకు కమిటీ


తెలంగాణ విద్యార్థులకు బోధనా రుసుము చెల్లించేందుకు ప్రభుత్వం రూపొందించిన 'ఫాస్ట్' పథకం విధివిధానాల ఖరారుకు కమిటీ ఏర్పాటైంది. ఈ మేరకు ఐదుగురు అధికారుల బృందంతో టీ ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ పథకం ద్వారా లబ్దిపొందేందుకు 1956కు ముందు నుంచీ తెలంగాణలో నివసిస్తున్న వారి సంతతే అర్హులని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ-ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూశాఖ జారీ చేస్తుందని ఉత్తర్వుల్లో వెల్లడించింది.

  • Loading...

More Telugu News