: 'చపాతి' ఘటన ఆమోదయోగ్యమైన చర్య కాదు : అద్వానీ
మహారాష్ట్రలో చోటుచేసుకున్న 'చపాతి' ఘటన ఆమోదయోగ్యమైన చర్య కాదని బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ పేర్కొన్నారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ లో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ లో మరాఠా సంప్రదాయ వంటకాలు తమకు పెట్టలేదన్న దుగ్ధతో శివసేన ఎంపీలు రంజాన్ మాసం ఆచరిస్తున్న ముస్లిం కేటరింగ్ సూపర్ వైజర్ తో బలవంతంగా చపాతీ తినిపించే ప్రయత్నం చేశారు. దీనిపై పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లాయి.