: ఏపీ, టీఎస్ రాష్ట్రాల్లో నేటి నుంచి ఈయూ నిరవధిక నిరాహారదీక్షలు


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) నేటి నుంచి నిరవధిక నిరాహారదీక్ష చేపడుతోంది. ఆర్టీసీ యాజమాన్యం సీసీఎస్ నిధికి చెల్లించాల్సిన సొమ్మును వెంటనే జమచేయాలనే డిమాండ్ తో నిరాహారదీక్షకు దిగుతున్నట్టు తెలంగాణ ఈయూ ప్రచార కార్యదర్శి మురళీధర్ తెలిపారు. హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద తెలంగాణ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి... విజయవాడలో ఏపీ యూనియన్ ప్రధాన కార్యదర్శి వైవీ రావు నిరశన దీక్ష చేపడతారని మురళీధర్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News