: విశాఖలో ముగిసిన శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు
విశాఖలో టీటీడీ ఆధ్వర్యంలో వారం రోజులుగా జరుగుతోన్న శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు మంగళవారం నాడు జరిగిన కల్యాణంతో ముగిశాయి. ఇవాళ స్వామివారికి జరిగిన సుప్రభాతం, తోమాల సేవ, కొలువు, అర్చన, విశేష పూజ అత్యంత వైభవంగా జరిగాయి. అలాగే అష్టదళ పాదపద్మారాధన సేవకు విశాఖ వాసులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తజనంతో స్వర్ణభారతి ఆడిటోరియం నిండిపోయింది.