: టీమిండియా సెంచరీ ...బారత్ 100/3
ఇంగ్లండుతో సౌతాంప్టన్ లో జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు భారత జట్టు బ్యాటింగ్ కు దిగింది. ఓవర్ నైట్ బ్యాట్స్ మన్ మురళీ విజయ్ (11), ఛటేశ్వర్ పూజారా(4) ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించారు. దీంతో పూజారా 24 పరుగులు, విజయ్ 35 పరుగుల వద్ధ పెవిలియన్ బాట పట్టారు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ (17), రహానే (4) ఆడుతున్నారు. ఇంగ్లండ్ బౌలర్లు పటిష్టమైన బంతులు వేస్తూ భారత బ్యాట్స్ మన్ ను ఇబ్బంది పెడుతున్నారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో టీమిండియా డ్రా కోసం ప్రయత్నించక తప్పని పరిస్థితి నెలకొంది. మూడో రోజు మూడు వికెట్లు కోల్పోయిన బారత జట్టు వంద పరుగుల మార్కును సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్ 2 వికెట్లు తీసి రాణించగా, అతనికి అండర్సన్ ఒక వికెట్ తీసి సహకారమందించాడు.