: సుష్మాస్వరాజ్ కు జగన్ లేఖ
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కు వైఎస్సార్సీపీ అధినేత జగన్ లేఖ రాశారు. లిబియాలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా స్వస్థలాలకు రప్పించాలని ఆయన లేఖలో కోరారు. బతుకు తెరువు కరవైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు ఉపాథి కోసం లిబియాకు వెళ్లారని, అంతర్యుద్ధం కారణంగా తీవ్ర ఇక్కట్లలో ఉన్నందువల్ల వారిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆయన సూచించారు. లిబియాలో హింస చెలరేగిన నేపథ్యంలో భారతీయులు స్వస్థలాలకు చేరుకోవాలని అక్కడి ఎంబసీ హెచ్చరికలు జారీచేసింది. ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న కార్మికులు పడుతున్న ఇబ్బందులను కొంతమంది మీడియా ప్రతినిధులకు తెలిపారు. ఈ నేపథ్యంలో వారిని రక్షించాలని జగన్ కేంద్ర మంత్రికి లేఖ రాశారు.