: అదృష్టం కలిసొచ్చి కామన్వెల్త్ రజతం తెలుగింటి తలుపు తట్టింది!


డోపింగుకి పాల్పడే క్రీడాకారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నా... క్రీడాకారులు మాదకద్రవ్యాలు తీసుకోవడం మానలేదు. తాజాగా కామన్వెల్త్ క్రీడల్లోనూ ఈ విషయం మరోసారి రుజువైంది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో 53 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చికా పసిడి పతకాన్ని సాధించింది. అయితే, డోపింగ్ లో చికా పట్టుబడటంతో ఇప్పుడు ఆమె పసిడి పతకాన్ని చేజార్చుకుంది. దాంతో తెలుగు అమ్మాయి సంతోషికి 53 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం దక్కే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News