: కామన్ వెల్త్ రెజ్లింగ్ విభాగంలో సెమీస్ చేరుకున్న సుశీల్ కుమార్
గ్లాస్గోలో జరుగుతున్న కామన్ వెల్త్ క్రీడల్లో రెజ్లింగ్ విభాగంలో భారత ఆటగాడు సుశీల్ కుమార్ సెమీస్ కు చేరుకున్నాడు. క్వార్టర్ ఫైనల్స్ లో పురుషుల 74 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో శ్రీలంకకు చెందిన కుషన్ సండ్రేగ్ ను మట్టికరిపించి సెమీ ఫైనల్స్ కు దూసుకెళ్లాడు. ఇక గత ఒలింపిక్స్ లో రజత పతకాన్ని గెల్చుకున్న విజయ్ కుమార్ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్స్ లో ఫైనల్ కు చేరుకోలేకపోయి నిరాశపరిచాడు.