: రంజాన్ సందర్భంగా తెలంగాణ మంత్రులకు డిప్యూటీ సీఎం విందు
రంజాన్ పర్వదినం సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రజలకు ఈద్ ముబారక్ (రంజాన్ శుభాకాంక్షలు) చెప్పారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు నాయిని నర్శింహారెడ్డి, పద్మారావు, ఎంపీలు కేకే, కవిత తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్, ప్రభుత్వ సలహాదారు రమణాచారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.